Header Banner

విమానాలకు భారతదేశంలోనే టెక్నికల్ స్టాప్ ప్లాన్! అమెరికా రూట్లలో కీలక మార్పులు!

  Sat May 03, 2025 11:42        India, U S A

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత విమానాలకు పాక్ గగనతలాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ నుంచి పలు దేశాలకు అరేబియా సముద్రం మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో భారత విమానాలు వెళ్తున్నాయి. అమెరికాలోని వివిధ ప్రాంతాలకు ఎయిర్ ఇండియా వారానికి 71 సర్వీసులు నడుపుతుండగా ఇందులో 54 సర్వీసులు కేవలం ఢిల్లీ నుంచే ఉన్నాయి. అయితే అరేబియా సముద్రం మీదుగా సర్వీసులను నడపడంతో ప్రయాణ గంటలు పెరగడంతో పాటు అధిక ఇంధన వినియోగం, సిబ్బంది డ్యూటీ సమయం పెరగడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానంగా అమెరికా వెళ్లే ఎయిరిండియా విమానాలు ఇంధనం నింపడం కోసం ఐరోపాలోని వియన్నా (ఆస్ట్రియా), కోపెన్ హాగెన్ (డెన్మార్క్) నగరాలను టెక్నికల్ స్టాఫ్‌గా చూసుకుంటున్నాయి.

దీంతో ల్యాండింగ్ చార్జీలు, ఇంధనం ఖర్చులతో భారీ వ్యయం అవుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే విమానాలకు భారత్‌లోనే టెక్నికల్ స్టాప్ ఉంటే బాగుంటుందని ఎయిర్ ఇండియా యోచిస్తోంది. ఇందు కోసం ముంబయి లేదా అహ్మదాబాద్‌లను ప్రత్యామ్నాయంగా చూస్తోంది. దీంతో యూరప్ నగరంలో ఆగాల్సిన పని లేకుండా నేరుగా అమెరికా చేరుకునే అవకాశం ఉంటుంది. ఎయిర్ ఇండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తాజా పరిణామాలకు సంబంధించి తమ సిబ్బందికి శుక్రవారం కీలక సమాచారం ఇచ్చారు. ఇటీవల గగనతల ఆంక్షల మూలంగా యూరప్, అమెరికా రూట్లలో తాత్కాలికంగా నెట్ వర్క్ సంబంధిత మార్పులు చాలా జరుగుతున్నాయని తెలిపారు. టెక్నికల్ స్టాప్ లను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో పురోగతి సాధించామని చెప్పారు.


ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AirIndia #FlightRoutes #IndiaToUSA #TechnicalStop #AviationNews #AirTravelUpdate #PakistanAirspaceBan